వాడకమంటే బాబుదే.. సీనియర్‌ నేత 30 ఏళ్ల సేవలు గుర్తులేవా?

10 Jun, 2023 16:20 IST|Sakshi

వాడుకుని వదిలేయడంతో చంద్రబాబును మించినవాళ్లు లేరు అనేది దేశవ్యాప్తంగా తెలిసిందే. తనకు అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తేసి తరువాత మొహం చాటేయడంతో ఆయన్ను మించినవాళ్లు లేరని ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉంది. 

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంటే వాస్తవానికి చంద్రబాబు అపారమైన ప్రేమ చూపిస్తారు. చూపిస్తారో నటిస్తారో తెలియదుకానీ.. టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన కొన్నాళ్ళకు కోడెల శివప్రసాద్ తన పిల్లలు చేసిన అరాచకాలకు బాధ్యత వహించాల్సి వచ్చింది. వాస్తవానికి ఆయన్ను ఇనుమేట్ల గ్రామంలో పోలింగ్ రోజున ప్రజలు తరిమి కొట్టడం, ఇన్ని దెబ్బలు కాసినా ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం  తెలిసిందే. 

బాబు శవ రాజకీయం..
ఆఖరుకు ప్రభుత్వ ఆఫీస్ కుర్చీలు సైతం ఆయన కుమారుడు శివరామ్‌ ఎత్తుకురావడమే కాకుండా సత్తెనపల్లిలో వీధి వ్యాపారుల నుంచి సైతం మామూళ్లు వసూళ్లు చేసిన అరాచకాలు.. తరువాత ఆయన కేసులు ఎదుర్కొని అవమానాలు పాలై చివరకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన చనిపోయాక అది ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపణలు చేసి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఒకరోజు.. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒకరోజు.. నరసరావుపేటలో ఒక రోజు ఇలా మూడు రోజులు ఆయన శవంతో రాజకీయం చేశారు చంద్రబాబు. 

ఆ తరువాత శివరామ్‌ను ఓదార్చి నీ పొలిటికల్ కెరీర్ నేను చూసుకుంటాను అంటూ రెండు.. రెండంటే రెండే.. కన్నీటి బొట్లు కుడికన్ను నుంచి కార్చి వెళ్లిపోయారు. ఇక అక్కడ మళ్ళీ తమ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడం, శివరామ్‌ గానీ పోటీ చేస్తే ఇనుమెట్ల సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని భయం. ఇవన్నీ కలగలిసి ఆ తరువాత శివరామ్‌కు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. అంటే కోడెలను వాడుకున్నారు.. ఆయన చనిపోయాక ఆయన కుటుంబానికి కెరీర్ క్లోజ్ చేసేశారు. అదన్నమాట బాబుగారి వాడకం.

శివమెత్తుతోన్న శివరామ్..
శని పట్టుకున్నా వదులుతుందేమో కానీ చంద్రబాబు పట్టుకుంటే మాత్రం వదలడు అనే నానుడి ఒకటి తెలుగు తమ్ముళ్లు తరచుగా చెప్పుకుంటారు. బతికి ఉండగా కోడెల శివప్రసాద్‌ను అనగదొక్కి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి కట్టబెట్టి మూలన కూర్చోబెట్టిన చంద్రబాబు. ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నారు చంద్రబాబు. తన తండ్రి రాజకీయ వారసత్వం తనకు వస్తుందని, సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని ఆశిస్తూ ఉన్న శివరామ్‌ను చంద్రబాబు పూర్తిగా పక్కన పడేసి.. అదే స్థానంలో కన్నా లక్ష్మి నారాయణను ప్రొజెక్ట్‌ చేయడంతో శివరామ్‌ శివాలెత్తి పోతున్నారు. 

‘ముప్పై ఐదేళ్ల తన తండ్రి సేవలు గుర్తుకు రాలేదా.. మా కుటుంబానికి న్యాయం చేస్తాం అని గతంలో ఇచ్చిన హామీ మర్చిపోయారా’ అని నేరుగా చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నాడు శివరామ్‌. వాస్తవానికి కోడెల గత ముప్పై ఐదేళ్ల రాజకీయం ఒకెత్తు కాగా 2014-2019 మధ్య చేసిన రాజకీయం ఇంకో ఎత్తు అని చెప్పాలి. ఇనేళ్లు తాను నిర్మించిన పొలిటికల్ కెరీర్ సౌధాన్ని జస్ట్ ఐదేళ్లలో కొడుకు శివరామ్‌ కూల్చేశాడు. 

తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని జిల్లావ్యాప్తంగా దోపిడీలు..సెటిల్మెంట్లు, దందాలు చేశారు. ఆఖరుకు చిన్న వ్యాపారుల నుంచి కూడా వసూళ్లు.. బిజినెస్ అవకాశం ఇస్తానంటూ ఎందరి దగ్గరో వసూళ్లు.. అడిగితే బెదిరింపులు.. ఇవన్నీ కలగలిసి ఏకంగా కోడెల శివ ప్రసాద్‌ను పోలింగ్ రోజున ఇనుమేట్ల గ్రామంలో ప్రజలు వెంటాడి కొట్టిన పరిస్తితి ఎదురైంది. ఇక తెలుగుదేశం పరిస్థితి చూసి సత్తెనపల్లిలో ఓటర్లు నవ్వుకుంటున్నారు. 

ప్రజల ప్రశ్నలు ఇవే.. 
- సత్తెనపల్లి ఎవరి ఆస్తి? 
- మేమే పాలిస్తామని ఎవరైనా ఎలా చెప్పుకుంటారు? 
- ఈ పవర్‌ చంద్రబాబు చేతికి ఎవరిచ్చారు? 
- సత్తెనపల్లికి ఎవరు రుణపడి ఉన్నారు? 
- ఇన్నాళ్లు కోడెల చేసిందేంటీ? 
- స్పీకర్‌గా ఉంటూ ఫర్నీచర్‌ ఎత్తుకురావడమేంటీ?
- కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లికి ఏంచేశారు?
- అసలు టీడీపీకి ఎందుకు ఓటేయాలి? 
- పదవుల కోసం పార్టీలు మారిన వారిని ఎందుకు ఎంచుకోవాలి? 
- రాజకీయ అవసరాల కోసం సత్తెనపల్లిని తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. తగ్గేదేలే అంటూ పచ్చ బ్యాచ్‌కు కౌంటర్‌!

మరిన్ని వార్తలు