‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం

23 Feb, 2021 07:15 IST|Sakshi

 కుప్పం పర్యటన ఖరారు

కేడర్‌ కాపాడుకునేందుకు యత్నం 

కుప్పం (చిత్తూరు జిల్లా): నియోజకవర్గంలో రాజకీయ చరిత్ర తిరగబడింది. టీడీపీ ఆవిర్భాం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలాడింది. ఈ ఫలితాలు చంద్రబాబును భయపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 74 పంచాయతీల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పది పంచాయతీల్లో అయి తే టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బాబు గుండె కాయ అన్ని చెప్పుకునే గుడుపల్లె మండలంలో 13 పంచాయతీలు వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుంది. కొన్ని పంచాయతీల్లో టీడీపీ త్రిబుల్‌ డిజిట్‌ దాటలేకపోయింది. గుడుపల్లె మండల గుండ్లసాగరం పంచాయతీల్లో కేవలం 15 ఓట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి, దాసమానపల్లెలో 98 ఓట్లు,  కెంచనబళ్ల పంచాయతీల్లో 39 ఓట్లు, 121 పెద్దూరు 197 ఓట్లు మాత్రమే టీడీపీకి వచ్చింది. కంచుకోటగా ఉన్న కుప్పం నియోజవవర్గంలో టీడీపీ ఎదురు దెబ్బతగిలింది.

కరోనాలో కన్నెత్తి చూడని బాబు 
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో సొంత నియోజకవర్గం వైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదు. ఆ ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఆయనకు సొంత నియోజక వర్గం గుర్తుకు వచ్చింది. ఫలితాలు వెలువడిన వారం తిరక్కముందే కుప్పం పర్యటనకు పరుగులు తీయడం బాబు అధైర్యానికి నిదర్శంగా తెలుస్తోంది.  35 ఏళ్లు రాజకీయ భవిష్యత్‌ కల్పించిన కుప్పం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనికరించని బాబు కేవలం పార్టీ దెబ్బతింటే మాత్రం ప్రజలు గుర్తుకు వచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

25,26 తేదీల్లో చంద్రబాబు కుప్పం రాక 
రాష్ట్ర ప్రతిపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపారు. రెండు రోజులు పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నట్లు సమాచారం.
చదవండి:
ఉరకలేస్తున్న వైఎస్సార్‌ సీపీ.. నిస్తేజంలో టీడీపీ   
బాబు గారూ ఇంకా ఎందుకు అబద్దాలు

 

మరిన్ని వార్తలు