నాకు పదవీకాంక్ష లేదు.. 14ఏళ్లు సీఎంగా చేశా..  

5 Mar, 2021 04:06 IST|Sakshi
రోడ్‌షోలో ప్రసంగిస్తున్న చంద్రబాబు 

గెలవలేక దౌర్జన్యాలు చేస్తున్నారు 

కర్నూలులో చంద్రబాబు 

‘సీమ’కు హైకోర్టు రానివ్వడంలేదని కాన్వాయ్‌ ముందు లాయర్ల ఆందోళన

సాక్షి, కర్నూలు‌ : ‘ఈరోజు నేను నా కోసం రాలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. పదేళ్లు ప్రతిపక్ష నేతను. నాకు పదవీకాంక్ష లేదు. మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు.. రాష్ట్ర భవి ష్యత్తు కోసం వచ్చాను. ఆశీర్వదిస్తారా? లేదా? అనే ది మీరే నిర్ణయించుకోండి’.. అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం కర్నూలులో ఎన్నికల ప్రచారం చేశారు.  కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో బోసిపోయిన ప్రచారాన్ని ఆయన నిరుత్సాహంగా కానిచ్చేశారు. చంద్రబాబు ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. 

‘నిర్మాణరంగం కుదేలైంది. మద్యం కావాలంటే కర్నూలు జిల్లా వాసులు కర్ణాటక, తెలంగాణకు వెళ్లి తాగుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం. జగన్‌ ఓ ఫేక్‌ ముఖ్యమంత్రి. అమరావతిని నిర్వీర్యం చేశారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఉద్యోగాల్లేవు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. విశాఖ ఉక్కును కాపాడలేకపోయారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు ఏకగ్రీవాలు చేసేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా కాలేదు. దౌర్జన్యాలు చేసి కైవసం చేసుకుంటున్నారు’ అని ఆరోపించారు.  

న్యాయవాదుల బైఠాయింపు 
ఇదిలా ఉంటే.. కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని పెద్దమార్కెట్‌ సమీపంలో కర్నూలు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు వి.నాగలక్ష్మిదేవి, ఎం.సుబ్బయ్య, ప్రభాకర్, షఫత్, మధుసూధన్‌రెడ్డి, రామాంజనేయులు తదితరులు చంద్రబాబు కాన్వాయ్‌ ఎదుట బైఠాయించారు. 

చదవండి: (జగన్‌మోహన్‌రెడ్డి పెట్రోల్‌ రేట్లు పెంచేశారు)

మరిన్ని వార్తలు