హెచ్చరికలకు తలొగ్గిన బాబు..

8 Mar, 2021 10:07 IST|Sakshi

బుద్ధా, మీరాలదీ అదే పరిస్థితి

మాజీ మంత్రిదీ అదే స్థితి

అభ్యర్థులతో మమ అనిపించిన బాబు

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన పార్టీ నగర నేతల హెచ్చరికలకు తలొగ్గారు. తన పార్టీకి చెందిన స్థానిక ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) వెంట లేకుండానే విజయవాడ నగరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ నాయకులు నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్, నాగుల్‌ మీరా కూడా కనిపించీ కనిపించనీయకుండా కార్యక్రమాన్ని మమ అనిపించారు. అధికారం ఉన్నంతకాలం అంతా నేనే, అన్నింటా తానే అన్నట్లు వ్యవహరించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి మరీ విడ్డూరం. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో కలిసి ఆయన నడక సాగించక తప్పలేదు.  

ఆసాంతం అసహనం, ఆగ్రహం 
కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం చంద్రబాబు నగరంలో ఎన్నికల ప్రచారాన్ని ఆసాంతం అసహనంతో, ఆగ్రహంతో, నిస్సహాయ స్థితిలో కొనసాగించారనేది పరిశీలకుల విశ్లేషణ. గతంలో విజయవాడలో జరిగిన బాబు ఏ పర్యటనలతో పోలి్చనా ఏమాత్రం పొంతన లేదని తేలి్చపారేశారు. జన సమీకరణకు ఎంతైనా వెదజల్లండని అధిష్టానం నుంచి అందిన ఆదేశాలను తూచా తప్పక పాటించినా ఆశించిన స్పందన లేకపోవడంతో నాయకుల్లో ఆందోళన అడుగడుగునా కనిపించింది. ప్రజలను, నాయకులను ఉద్దేశించి బాబు మాట్లాడిన తీరు విజయవాడలో టీడీపీ దుస్థితి నగరవాసులకు ఆదివారం కళ్లకు కట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడటం పరిశీలనాంశం.  

ఎంపీపై తిరుగుబాటుతో...  
పార్టీ నగర ముఖ్య నాయకులైన బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం, ఆ వెనువెంటనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితర సీనియర్‌ నేతలు పలువురు జోక్యం చేసుకుని సర్దిచెప్పడానికి ఎంత ప్రయత్నించినా వారు ససేమిరా అనడం తెలిసిందే. మీ పర్యటనలో కేశినేని ఉన్నట్లయితే తాము పాల్గొనబోయేది లేదఅని చంద్రబాబుకే అలి్టమేటం ఇవ్వడంతో పశి్చమ, మధ్య నియోజకవర్గాల్లో ఎంపీ తన వెంట లేకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడు జాగ్రత్తపడ్డారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారీ్టలు అంటే కేశినేనికి అలుసని, కుల అహంకారమని దుమ్మెత్తిపోశారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని గుంటూరు, విజయవాడ మేయర్‌ పీఠాన్ని ఒకే సామాజిక వర్గానికి ఇవ్వవద్దని ముఖ్య నాయకులు చేసిన సూచనలను చంద్రబాబు పెడచెవిన పెట్టడం కూడా ఇతర సామాజికవర్గాల నేతల ఆగ్రహానికి కారణమైంది.

పార్టీకి, తమ సామాజికవర్గానికి రెండు జిల్లాలు కేంద్ర బిందువుల్లాంటివని వల్లెవేసే వారికి గత సాధారణ ఎన్నికల్లో, మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు కీలెరిగి వాతపెట్టారు. రెండు జిల్లాల్లోనూ రెండు ఎంపీ స్థానాలు, నాలుగు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టారు. విజయవాడ, గుంటూరు నగర శివార్లలోని మెజార్టీ పంచాయతీలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే గెలుపొందారు. మొన్నం కుప్పం, నిన్న విజయవాడలో పార్టీ పరిస్థితిని బేరీజు వేసుకున్నందునే బాబు కేశినేనిని దూరం పెట్టారని సీనియర్లు అంటున్నారు. అందువల్లే పార్టీ తరఫున మేయర్‌ అభ్యర్థి, కేశినేని కుమార్తె అయిన శ్వేత, ఆయా డివిజన్లలో కార్పొరేటర్‌ అభ్యర్థి, ఇతర ఛోటామోటా నాయకులు బాబుతో పాటు ప్రచార వాహనంపై చోటిచ్చారని గుర్తుచేశారు. మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా కనిపించారు.
చదవండి:
విజయవాడలో చంద్రబాబుకు చేదు అనుభవం 
రామోజీ రూటే వేరు...నిజాలెక్కడ?

మరిన్ని వార్తలు