కింగ్‌ ఆఫ్‌ కరప్షన్‌.. చంద్రబాబే స్వయంగా దాన్ని అంగీకరించారు: విజయసాయిరెడ్డి

18 Sep, 2023 19:32 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు కింగ్‌ ఆఫ్‌ కరప్షన్‌ అని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభివర్ణించారు. సోమవారం పార్లమెంట్‌ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. 

తనపై తొమ్మిది క్రిమినల్‌ కేసులు ఉన్నాయని స్వయంగా చంద్రబాబే అఫిడవిట్‌ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి కుట్రకు పాల్పడ్డారు. ఆయన కింగ్‌ ఆఫ్‌ కరప్షన్‌. స్కిల్‌ స్కామ్‌లో అవినీతికి సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు చూసిన తర్వాతే చంద్రబాబును కోర్టు రిమాండ్‌కు పంపింది. చంద్రబాబు ఒక వెన్నుపోటు దారుడు. బీజేపీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలకూ వెన్నుపోటు పొడిచాడు అని విజయసాయిరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు