చంద్రబాబుకు అన్నీ ఉగ్రవాది లక్షణాలే: మంత్రి

9 May, 2021 19:39 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: కోవిడ్‌ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం పని చేస్తున్నారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సురక్షితంగా ఉందన్నారు. కానీ రాష్ట్ర ప్రజలను అభద్రతా భావంలోకి నెట్టేందుకు ప్రతిపక్షాలు, పచ్చ మీడియా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. N440 వైరస్‌ లేదని శాస్త్రవేత్తలు చెప్పినా భయం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన సమయంలో అబద్ధాలతో వారిని భయభ్రాంతులకు గురి చేస్తారా? అని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. అసలు సీసీఎంబీ డేటాను చంద్రబాబు ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఉండే లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయని, ఆయనొక రాజకీయ ఉగ్రవాది అని విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్‌ను కేంద్రం.. రాష్ట్రాలకు వాటాగా ఇస్తోందని, ఇప్పటికైనా వ్యాక్సిన్‌పై దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.

చదవండి: 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బర్డ్‌ ప్లూ వైరస్‌ బతకదు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు