కుప్పంలో సీఐలకు చంద్రబాబు బెదిరింపు

30 Oct, 2021 12:40 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: కుప్పంలో సీఐలపై చంద్రబాబు బెదిరింపు ధోరణి ప్రదర్శించారు. తాను బస చేస్తున్న బస్సులోకి పిలిపించుకుని కుప్పం అర్బన్‌ సీఐ, రూరల్‌ సీఐలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనంటే ఏమనుకుంటున్నారంటూ మండిపడ్డారు. వచ్చేది మా ప్రభుత్వమే.. జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేయగా.. మేం రూల్స్‌ ప్రకారమే నడుచుకుంటున్నామని సీఐలు ధీటుగా సమాధానం ఇచ్చారు.
చదవండి: బద్వేల్‌లో టీడీపీ కుట్ర రాజకీయాలు

మరిన్ని వార్తలు