Charanjit Singh Channi: పంజాబ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

20 Sep, 2021 11:41 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం చన్నీ కెప్టెన్‌ అమరీందర్‌ను కలవనున్నారు. 
(చదవండి: ఎవరీ చన్నీ? )

పంజాబ్‌లో దళిత వర్గానికి సీఎం పదవి దక్కడం ఇదే ప్రథమం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ 1972 ఏప్రిల్‌ 2న పంజాబ్‌లోని మక్రోనా కలాన్‌ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అజ్మేర్‌ కౌర్, హర్సా సింగ్‌. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన వారు. 
(చదవండి: Amarinder Singh: కెప్టెన్‌ కథ కంచికి చేరిందిలా!)

చన్నీ చాంకౌర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2015-16లె పంజాబ్‌ విధానసభలో విపక్షనేతగా ఉన్నారు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణశాఖ బాధ్యతలు నిర్వహించారు. 

చదవండి: విందుకు అందని పిలుపు.. వివాదానికి ఆజ్యం పోసిన ప్రమోషన్‌

మరిన్ని వార్తలు