సుప్రీంకోర్టుకు వెళితే టీడీపీకి ఉలికిపాటెందుకు?

18 Sep, 2022 04:12 IST|Sakshi

లోకేష్‌వి రాజకీయ పరిజ్ఞానం లేని మాటలు

బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ

రామచంద్రపురం: మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళితే టీడీపీకి ఉలికిపాటెందుకని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. టీడీపీ నాయకులవి వికృత చేష్టలని వ్యాఖ్యానించారు. హైకోర్టులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురైతే సుప్రీం కోర్టుకు వెళ్లే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనే విషయం టీడీపీ వారికి తెలియదా అని మంత్రి ప్రశ్నించారు.

ఆయన శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని కాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదని, లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తూ టీడీపీ, ఎల్లో మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.

పాలన వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని చెప్పారు. ప్రజా తీర్పుతో గెలవలేని నారా లోకేష్‌ దొడ్డిదారిన పెద్దల సభకు వచ్చి రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దిగజారుడు మాటలు మాట్లాడారని అన్నారు. 

మరిన్ని వార్తలు