చెన్నూరు (SC) రాజ‌కీయ చ‌రిత్ర.. ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..?

25 Jul, 2023 16:25 IST|Sakshi
chennur constituency

చెన్నూరు రిజర్వుడ్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ నేత బల్క సుమన్ విజయం సాదించారు. 2014లో ఆయన పెద్దపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన 2018లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్‌ ఐ కు చెందిన బొర్లకుంట వెంకటేష్‌ నేతపై 28126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదేలు కు టిఆర్‌ఎస్‌ టిక్కెట్‌  ఇవ్వలేదు. అది కొంత గొడవ అయినా, ఆ తర్వాత సర్దుకుని బల్క సుమన్‌ గెలుపొందారు. 

నల్లాల ఓదేలు మూడోసారి..
ఆ తర్వాత రోజులలో వెంకటేష్‌ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరి పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. ఇక్కడ మూడోస్థానం ఆర్పిఐ కి చెందిన సంజీవ్‌ కు వచ్చింది. ఆయనకు 5274 ఓట్లు వచ్చాయి. 2014లో టిఆర్‌ఎస్‌ నేత  నల్లాల ఓదేలు మూడోసారి గెలిచారు. 2014 ఎన్నికలలో ఆయన తన సమీప కాంగ్రెస్‌ఐ  ప్రత్యర్ది మాజీ మంత్రి వినోద్‌ను ఓడిరచారు. పెద్దపల్లి ఎమ్‌.పి వివేక్‌ సోదరుడు అయిన ఈయన కొంతకాలం క్రితం వరకు టిఆర్‌ఎస్‌ లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌ఐలో చేరారు. 

ఆ తర్వాత వినోద్‌ బిఎస్పి తరపున బెల్లంపల్లిలో 2018లో పోటీచేసి ఓడిపోతే, వివేక్‌ బిజెపి పక్షాన పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి చెందారు. ఓదేలు రెండువేల తొమ్మిదిలో  గెలుపొంది, తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో గెలుపొందారు.  తెలంగాణ ఏర్పాటు అయిన నేపద్యంలో తిరిగి 26164 ఓట్ల తేడాతో మూడోసారి ఘన విజయం సాధించారు. 2018లో ఆయనకు టిక్కెట్‌ ఇవ్వలేదు. 1962లో నుంచి ఏర్పడిన చెన్నూరు అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందితే, తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు గెలవగా మూడుసార్లు టిఆర్‌ఎస్‌ విజయం సాధించింది. 1983 తరువాత ఒక్కసారే కాంగ్రెస్‌ ఐ గెలవగలిగింది. 

సాధారణ ఎన్నికలలో ఒంటరిగా విజయం.. :
మహాకూటమిలో భాగంగా టిఆర్‌ఎస్‌ 2009లో పోటీచేసి గెలవగా, ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో ఒంటరిగా విజయం సాదించింది. ప్రముఖ కాంగ్రెస్‌ నేత కోదాటి రాజమల్లు ఇక్కడ మూడుసార్లు గెలిస్తే, అంతకుముందు సిర్పూరులో ఒకసారి, లక్సెట్టిపేటలో మరోసారి గెలిచారు. టిడిపి నేత బోడ జనార్దన్‌ నాలుగుసార్లు విజయం సాధించగా, ప్రముఖ కార్మికనేత ఏడుసార్లు ఎమ్‌పిగా నెగ్గిన జి. వెంకటస్వామి కుమారుడు  వినోద్‌ 2004లో ఇక్కడ గెలిచి, రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడు కాగలిగారు. కోదాటి రాజమల్లు జలగం క్యాబినెట్‌లో ఉండగా, జనార్థన్‌ 1989లో ఎన్‌టిఆర్‌ క్యాబినెట్‌లో ఉన్నారు.

చెన్నూరు(ఎస్‌సీ)లో ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే.. :

మరిన్ని వార్తలు