కాంగ్రెస్‌లో చేరిన చెరుకు సుధాకర్.. మునుగోడు రాజకీయం రసవత్తరం

5 Aug, 2022 11:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. చెరుకు సుధాకర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన రాకను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చెరుకు సుధాకర్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కాకపుట్టిస్తున్న మునుగోడు రాజకీయం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసే విషయంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. చలమల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్‌లో ఒకరిని ప్రకటించే యోచనలో ఉంది.  ఇవాళ జరిగే మునుగోడు సమావేశంలో అభ్యర్థిని అధికారంగా ప్రకటించే అవకాశముంది.
చదవండి: మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధం

మరిన్ని వార్తలు