వీవీ ప్యాట్‌ల అంశంపై సమగ్ర వివరణకు సీఈవో ఆదేశం

31 Oct, 2021 14:40 IST|Sakshi
శశాంక్‌ గోయల్‌ (ఫైల్‌)

హైదరాబాద్‌: హుజురాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా వీవీ ప్యాట్లు తారుమారయ్యాయని బీజేపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఈవో శశాంక్‌ గోయల్‌ ఎన్నికల అధికారులతో ఆదివారం వీడియో  కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

వీవీ ప్యాట్‌ల అంశంపై సమగ్ర వివరణ ఇ‍వ్వాలని కలెక్టర్‌, వీఆర్వోలకు ఆదేశాలు జారీచేశారు. రేపు (సోమవారం) అన్ని పార్టీల నేతలతో సీఈవో శశాంక్‌ గోయల్‌ భేటీకానున్నారు. 

చదవండి: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారు: ఈటల

మరిన్ని వార్తలు