ఇది ప్రజా విజయం: శ్రీకాంత్‌రెడ్డి

2 Nov, 2021 13:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇది ప్రజా విజయమని.. ప్రజలను నమ్ముకున్న పార్టీ వైఎస్సార్‌సీపీ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడి​కోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ పోటీ చేసినా కథ నడిపింది చంద్రబాబే అని దుయ్యబట్టారు. క్యాలెండర్‌ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. బీజేపీ, టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయాయి. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.

‘‘బద్వేల్ ఫలితం మరింత బాధ్యత పెంచింది. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు ఇది. ఇది దళితులు, బీసీలు, సామాన్యుల విజయం. ప్రజలు మా వైపే నిలిచారు సీఎం జగన్ పారదర్శక పాలనకు ప్రజలు అండగా నిలిచారు. నిరంతరం దుష్ప్రచారం చేసే టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పారు. బీజేపీ గతంలో ఇచ్చిన హామీలు విస్మరించినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రత్యేక హోదా సహా, విభజన చట్టంలోని హామీలేవి బీజేపీ నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ఆయన క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అందుకే ప్రజలు ఆయనకు ప్రతి ఎన్నికల్లోనూ మద్దతుగా నిలుస్తున్నారని’’ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు