‘బద్వేలు తీర్పు సీఎం జగన్‌పై నమ్మకానికి నిదర్శనం’

2 Nov, 2021 16:40 IST|Sakshi

తాడేపల్లి: బద్వేలు తీర్పు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకానికి నిదర్శనమని ప్రభుత్వవిప్‌ కోరుముట్ల శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.  వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలకు అండగా నిలుస్తున్నాయని, మేనిఫెస్టోను అమలు చేసి సీఎం జగన్‌ తన క్రెడిబిలిటీ నిరూపించుకున్నారని ప్రశంసించారు. టీడీపీ  కుట్రలు చేసి అలజడి సృష్టించాలనుకున్నా ఏమిచేయలేకపోయారని కోరుముట్ల శ్రీనివాస్‌ విమర్శించారు. బద్వేల్‌లో ప్రజలు.. రికార్డు స్థాయిలో దాసరి సుధకు 90 వేల మెజారిటీ ఇచ్చారని అన్నారు.

‘ప్రజలు నైతిక పాలనకు ప్రజలు దివేనలు అందించారు
కర్నూలు: కరోనా విపత్తులోను.. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలను అందించారని ఎ‍మ్మెల్యే హాఫిజ్‌ ఖాన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కావాలనే వైఎస్‌ జగన్‌ పాలనపై పనిగట్టుకుని బురద జల్లుతున్నాయన్నారు. రెండు సంవత్సరాలుగా ప్రతి పక్షనేతలు.. ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.బద్వేలు ఎన్నికల్లో టీడీపీ హైడ్రామాలు ఆడిందని ఎమ్మెల్యే హాఫిజ్‌ ఖాన్‌ విమర్శించారు. నైతికంగా సుపరిపాలన అందిస్తున్న.. వైఎస్‌ జగన్‌ పాలనకు ప్రజలు దివెనలు అందించారని ఎ‍మ్మెల్యే హాఫిజ్‌ ఖాన్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు