ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత..

20 Nov, 2022 15:44 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. శివసేన కార్యకర్తలు దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్యాణ్ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగానే ఈ కార్యాలయన్ని తొలగించినట్లు కల్యాణ్ డాంబివిల్ మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఓ ఆటస్థలానికి కేటాయించిన స్థలంలో శివసేన కార్యాలయం ఉందని, అందుకే కూల్చివేశామని చెప్పారు. ఈ ఆఫీస్‌తో పాటు ఇతర ‍అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసినట్లు స్పష్టం చేశారు.

ఉద్ధవ్ శివసేన వర్గం మాత్రం రాజకీయ ప్రతీకారంతోనే తమ కార్యాలయాన్ని కూల్చివేశారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిడితోనే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. గత 17 ఏళ్లుగా ఈ కార్యాలయం ఉందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు చెప్పడమేంటని ప్రశ్నించారు.
చదవండి: సౌరాష్ట్ర ఎవరికి సై?

మరిన్ని వార్తలు