ఫుల్లుగా తాగిన సీఎంను విమానం నుంచి దింపారని ఆరోపణలు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

20 Sep, 2022 14:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌ను జర్మనీలోని ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేశారని సోమవారం ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. తాజాగా పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయం స్పందించారు.

పంజాబ్ సీఎంపై వచ్చిన ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని సింధియా తెలిపారు. అయితే ఈ ఘటన విదేశీ గడ్డపై జరిగినందున అసలు నిజానిజాలు ఏంటో తెలుసుకోవాల్సి ఉందన్నారు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ వివరాలు వెల్లడించాల్సి ఉందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని తనకు విజ్ఞప్తులు అందాయని, కచ్చితంగా దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు.

ఏం జరిగింది?
జర్మనీ పర్యటన ముగించుకుని సోమవారం ఢిల్లీకి తిరిగివచ్చారు భగవంత్ మాన్. అయినే ఫుల్లుగా తాగి ఉన్న కారణంగా ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేశారని, దీనివల్ల నాలుగు గంటలు ప్రయాణానికి ఆలస్యమైందని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. భగవంత్ మాన్ పంజాబీల పరువు తీశారని శిరోమణి ఆకాలీదళ్ ధ్వజమెత్తింది. 

అయితే లుఫ్తాన్సా సంస్థ దీనిపై స్పష్టత ఇచ్చింది. విమానాన్ని మార్చాల్సి రావడం వల్లే ఆలస్యం అయిందని చెప్పింది. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ ఆరోపణలను ఖండించించి. పంజాబ్‌ సీఎంను అప్రతిష్టపాలు చేసేందుకే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగింది. భగవంత్ మాన్‌ సోమవారం జర్మనీ నుంచి ఢిల్లీకి చేరుకుని నేరుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు.
చదవండి: మాట్లాడింది మమతేనా? మోదీకి సపోర్ట్ చేయడమేంటి?

>
మరిన్ని వార్తలు