అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. కుర్చీలతో కుమ్మేసుకున్నారు

9 Nov, 2022 14:52 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కళ్యాణదుర్గంలో జరిగిన టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఉమామహేశ్వర్‌ నాయుడు వర్గాలు బాహాబాహీకి దిగాయి.

ఇందులో ఇరువర్గాలు కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పలువురు సర్దిచెప్పినా కూడా ఏమాత్రం పట్టించుకోని ఇరువర్గాలు నాయకుల ముందే దాడులు చేసుకోవడం గమనార్హం.

చదవండి: (మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు)

మరిన్ని వార్తలు