-

కేసీఆర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సిగ్గుపడుతున్నా: భట్టి విక్రమార్క

4 Feb, 2022 17:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పౌరుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సిగ్గుపడుతున్నానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భారత రాజ్యంగంపై కేసీఆర్‌ ప్రమాదకర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాజ్యంగం దేశ పౌరులకు హక్కులకు కల్పించిన పవిత్ర గ్రంథమని కొనియాడారు. పురుషులతో మహిళలలకు సమానత్వం కల్పించిందన్నారు. ఈ రోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే అది రాజ్యంగం చలవేనని తెలిపారు. రాజ్యంగం లేకుంటే రాజులు, రాజ్యాలు మాత్రమే ఉండేవని అన్నారు. రాచరికపు ఆలోచన ఉన్నవారు మాత్రమే ఇలాంటి ఆలోచన చేస్తారని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.
చదవండి: ఆసక్తికర దృశ్యం: సలాం.. రామ్ రామ్

‘తనకు మాత్రమే అధికారం ఉండాలనుకునే వారు రాజ్యంగాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ ఎన్నికలకు అనర్హుడు. ఈ రాష్ర్టాన్ని పాలించడానికి అనర్హుడు. కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తేనే.. రాజ్యంగానికి గౌరవం. అసభ్య పదజాలాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే కేసీఆర్. ఇది ఏ వర్గ సమస్యో కాదు.. దేశ ప్రజలందరి సమస్య. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేస్తాం. 6 నెలల పాటు ఈ ఉధ్యమం నడిపిస్తాం. కాంగ్రెస్‌లో ప్రతీ విభాగం ఈ ఉధ్యమంలో పాల్గొంటుంది.’ అని తెలిపారు.
చదవండి: ‍కాంగ్రెస్‌లో చేరిన చెన్నారెడ్డి మనవడు

మరిన్ని వార్తలు