‘ఆ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతున్నాయి’

2 Mar, 2021 20:44 IST|Sakshi

మంత్రి కేటీఆర్‌వి కాకి లెక్కలు

కేసీఆర్.. నిరుద్యోగ భ్రుతి ఏమైంది?

ఉద్యోగాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చకు రావాలి

సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మల్లు

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ర్టంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువత, నిరుద్యోగలను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఇద్దరూ కాకిలెక్కలు చెబుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారని మండిపడ్డారు. ఇద్దరూ తోడు దొంగలేనన్నాని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు కల్పించాయో చర్చకు రావాలని భట్టి డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పెంచకపోగా నిరుద్యోగ సమస్య తీవ్రతరం చేశారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎత్తేయడం, అమ్మేయడం వల్ల దళిత, బడుగు, బలహీన ఇతర వర్గాల ప్రజలు ఉద్యోగాలను కోల్పోవడమేకాక భవిష్యత్తులో ఉద్యోగవకాశాలు లేకుండా పోతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు,

ఈ మేరకు భట్టి విక్రమార్క మంగళశారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్స్ ద్వారా కూడా ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని, కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇచ్చింది లేదని అన్నారు. పీఆర్‌సీ ఇచ్చిన నివేదిక ప్రకారమే రాష్ట్రంలో 1 లక్షా 91 వేల ఖాళీలు ఉన్నాయని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాల నియామకాలు చేస్తానన్న కేసీఆర్ అదీ చేయకపోగా ఈ లక్షా 91 వేల ఖాళీలు అలాగే ఉన్నాయని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కేటీఆర్ మాత్రం ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగభృతి ఊసేలేదని 3016 రుపాయలు ఇస్తానన్నారని, దాని ప్రస్తావన లేదన్నారు. కనీసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించలేదని మండిపడ్డారు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వల్ల దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువత ఉద్యోగాలు లేక నిరాశలో ఉందని భట్టి చెప్పారు. ఈ నేఫథ్యంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు విద్యావంతులైన యువత బుద్ధి చెప్పాలని భట్టి విలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం, నిరుద్యోగ భ్రుతి కోసం ఎదురు చూస్తున్న యువత తమ చేతిలోని ఓటుతో రెండు పార్టీలకు సరైన సమాధానం చెప్పాల్సిన సమయం ఇదేనని అన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పిన నిరుద్యోగ భ్రుతి హామీ రెండేళ్లయినా నెరవేర్చలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం భ్రుతికి సంబంధించిన విధివిధానాలను కూడా ఖరారు చేయలేదని అన్నారు. 

చదవండి: ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు: భట్టి

మరిన్ని వార్తలు