గవర్నర్‌తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ

25 Jan, 2024 04:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. 75వ గణతంత్ర వేడుకలకు హాజరుకావాలని గవర్నర్‌ను వారు సాదరంగా ఆహ్వానించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొని అక్కడ భారీఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన విషయాలను గవర్నర్‌కు ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం.

అలాగే లండన్‌ పర్యటన, అక్కడి ప్రతినిధులతో జరిపిన చర్చల సారాంశాన్ని కూడా రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గవర్నర్‌ దృష్టికి తీసుకుని వచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ నియామకం అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గవర్నర్‌తో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ నియామకం త్వరగా జరిగితే ఉద్యోగ నోటిఫికేషన్లతోపాటు, ఇదివరకే నిర్వహించిన పరీక్షల ఫలితాల వెల్లడికి వీలవుతుందని తెలిపినట్లు తెలిసింది.  

whatsapp channel

మరిన్ని వార్తలు