ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌ క్లారిటీ.. ఏమన్నారంటే?

1 Feb, 2022 20:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. 103 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. సోషల్‌మీడియాలో జరిగే తలాతోకా లేని ప్రచారాన్ని నమ్మవద్దని కేసీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన సీఎం కేసీఆర్‌.. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: పనికిమాలిన పసలేని బడ్జెట్‌ ఇది: సీఎం కేసీఆర్‌

బడ్జెట్‌లో పేదల సంక్షేమానికి కేటాయింపులు లేకపోవడంపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి తనకు తాను ఆత్మ వంచన చేసుకుని.. దేశ ప్రజలను ఘోరంగా వంచించారని తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితులు, గిరిజన సంక్షేమంపై కేంద్రానికి చిత్త శుద్ధి లేదన్నారు. వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు ఊసే లేదని తెలిపారు. యూరియా సబ్సిడీ, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత పెట్టారని మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను ప్రధాని మోదీ మోసం చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు