ఖమ్మం నేతలతో భేటీ.. ‘పొంగులేటి’ వ్యవహారంపై కేసీఆర్‌ ఏమన్నారు?

9 Jan, 2023 19:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు సమావేశం సాగింది. ఈ నెల 18న జరగనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సూచించారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై కూడా సీఎం కేసీఆర్‌ చర్చించినట్లు తెలిసింది. పొంగులేటి పార్టీ వీడినా నియోజకవర్గంలో క్యాడర్‌ చేజారకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సూచించారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కాగా, టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ నగరంలో నూతన కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లను కేసీఆర్‌ ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
చదవండి: సంక్రాంతి తర్వాత తెలంగాణ పాలిటిక్స్‌లో హై వోల్టేజ్ హీట్

మరిన్ని వార్తలు