ఫామ్‌హౌజ్‌లో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్‌: సీఎం కేసీఆర్‌

8 Nov, 2021 19:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని వదిలే ప్రశ్నే లేదని.. వెంటాడుతూనే ఉంటానని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫామ్‌హౌజ్‌లో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్ అంటూ బండి సంజయ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: నిరుద్యోగులకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌..

తెలంగాణ ఉద్యమంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ గురువు నేర్పిన సంస్కారం ఇదేనా.. అని హితవు పలికారు. నా ఫామ్‌ హౌస్‌ దున్నడానికి బండి సంజయ్‌ ట్రాక్టర్‌ డ్రైవరా? అంటూ ఎద్దేవా చేశారు. నాది ఫామ్‌హౌస్ కాదు.. ఫార్మర్ హౌస్. తాను వ్యవసాయ కుటుంబంలో పుట్టానని కేసీఆర్‌ తెలిపారు. సూట్‌ కేసులు ఇచ్చేది మీరు.. మేము కాదని కేసీఆర్‌.. బీజేపీపై రాష్ట్ర అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు