భారతదేశం రాజ్యంగం ప్రకారమే నడుస్తుంది! : యోగి

14 Feb, 2022 12:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఏడు దశల ఎన్నికల పోలింగ్‌లో భాగంగా నేడు సెకండ్‌ ఫేస్‌ ఎన్నికల జరుగుతన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విలేకరుల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నవీన భారతదేశం రాజ్యంగం ప్రకారమే నడుస్తుంది తప్ప షరియత్‌ చట్టల ప్రకారం కాదని యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ని అంతిమంగా జయించాలనే కోరిక ఎప్పటికి సాకారం కాదని నొక్కి చెప్పారు.

ఈ మేరకు యోగి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...రాష్ట్రంలో " "80 ​​వర్సెస్ 20"లను సూచించేలా ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే అభివృద్ధిని వెనకేసుకొచ్చే 80 శాతం మందికి.. ప్రతిదీ వ్యతిరేకించే 20 శాతం మంది మధ్య జరుతున్న పోరుగా అభివర్ణించారు. ఈ నవీన భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన భారతదేశ నాయకుడు నరేంద్ర మోదీ అని నేను చాలా స్పషంగా చెప్పగలను. ఈ అభివృద్ధి అందర్నీ సంతృప్తి పరచలేకపోతోంది. తాలిబానీ ఆలోచనల మత ఛాందసవాదులు ఇది అర్థం చేసుకోండి. భారతదేశం షరియత్ ప్రకారం కాదు, రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది." అని అన్నారు.

అంతేకాదు కాలేజీలలో హిజాబ్ ఆంక్షలపై కర్ణాటకలో జరిగిన భారీ గొడవపై కూడా మాట్లాడారు. మన వ్యక్తిగత విశ్వాసాలు, ఇష్టాలు, అయిష్టాలను దేశం లేదా సంస్థలపై విధించలేమన్నారు. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ ఉండాలని, ఇది పాఠశాల క్రమశిక్షణకు సంబంధించిన విషయం అని చెప్పారు. అంతేకాదు ఒకరి వ్యక్తిగత విశ్వాసం వేరు, కానీ సంస్థల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ నిబంధనలను అంగీకరించాలి అని అన్నారు. హిజాబ్ విషయమై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను యోగి ఖండించారు. భారతదేశపు ప్రతి ఆడపిల్ల స్వేచ్ఛ, హక్కుల కోసమే ప్రధాని మోదీ ట్రిపుల్ తలాక్ దుర్వినియోగాన్ని ఆపారనే విషయాన్ని ప్రస్తావిస్తూ గట్టి కౌంటరిచ్చారు.

బాలిక సాధికారత కోసమే బీజేపీ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుటుందని చెప్పుకొచ్చారు. యూపిలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీకి బలమైన సవాలుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోసం ప్రచారం చేయడానికి వచ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై కూడా ధ్వజమెత్తారు.

కొంత మంది వ్యక్తులు బెంగాల్ నుండి వచ్చి ఇక్కడ అరాచకాలను వ్యాప్తి చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.  ప్రజలకు అందుతున్న గౌరవం, భద్రత అభివృద్ధిని అడ్డుకునేందుకు వచ్చారని ప్రజలు దీన్ని వ్యతిరేకించేలా వారిని అప్రమత్తం చేయడం తన బాధ్యతని అన్నారు. అంతేకాదు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్‌పై యోగి మండిపడ్డారు.

అఖిలేష్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు (2012-2017) రాష్ట్ర నిధులను సక్రమంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టకుండా నిద్రపోతూ కలలు కంటున్నారంటూ విమర్శించారు. అంతేకాదు కాంగ్రెస్‌ నేతల రాహుల్‌ గాంధీ, ప్రియాంకా తనను టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ని ముంచడానికి ఎవరూ అవసరం లేదు ఈ అక్కాతమ్ముడు చాలు అంటూ యోగి ధ్వజమెత్తారు.

(చదవండి: హిజాబ్ ధరించకపోవడం వల్లే మహిళలపై అత్యాచారాలు'.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు