UP Elections: యూపీ ప్రజలకు సీఎం యోగీ కీలక హామీ.. అఖిలేష్‌ కౌంటర్‌

23 Feb, 2022 16:56 IST|Sakshi

లక్నోః యూపీలో బుధవారం నాలుగో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతోంది. ఓ వైపు ఎన్నికల​కు పోలింగ్‌ కొనసాగుతుండగానే యూపీ ప్రజలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కీలక హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌.. బీజేపీ సర్కార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే, యూపీలోని అమేథిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం యోగి మాట్లాడుతూ.. సంరక్షణ కరవైన గోవులను పెంచే రైతులకు రూ. 1000 సాయంగా అందజేస్తామన్నారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్‌లో గో హత్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ గోవధ శాలలను శాశ్వతంగా మూసివేస్తామన్నారు. వాటిని తెరవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సంరక్షణ లేని గోవులు రైతుల పంటపొలాలను పాడు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  దెబ్బతీయకుండా చూస్తామన్నారు. 

ఇదిలా ఉండగా యూపీలోని బహ్రెయిచ్‌లో మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవుల సంరక్షణ కోసం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. రైతులకు నష్టం కలిగేలా పంట పొలాలను గోవులు నాశనం చేస్తున్నాయని విమర్శించారు.

మరిన్ని వార్తలు