సభలో సీఎం యోగితో నవ్వులు పూయించిన అఖిలేష్‌.. కాసేపటికే అసలు విషయం చెప్పి..

30 May, 2022 19:56 IST|Sakshi

లక్నో: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రతిపక్షనేత, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ సభలో నవ్వులు పూయించారు. సీఎం యోగి సైతం విరగబడి నవ్వుకున్నారు. 25 కోట్ల జనాభా కలిగిన పెద్ద రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత వెనుకబాటుకు గురైందో చెప్తూ యోగి ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్‌ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఓ ఘటనను ఆయన సోమవారం నాటి శాసనసభ సమావేశాల్లో గుర్తు చేసుకున్నారు. 

‘విద్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు పాఠశాలలను సందర్శించేవాడిని. ఆ క్రమంలోనే ఓ ప్రాథమిక పాఠశాలకు తనిఖీలకు వెళ్లాను. ఓ పిల్లవాడిని నేను ఎవరిని అని అడిగాను. ఒక్క క్షణం ఆలోచించి అతను చెప్పిన సమాధానం నాకు మతిపోయేలా చేసింది. మీరు రాహుల్‌ గాంధీ అని ఆ విద్యార్థి చెప్పడంతో మన విద్యా వ్యవస్థ ఎంత దీనస్థితిలో ఉందోనని బాధపడ్డా’ అని అఖిలేష్‌ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంగుబాటుకు అందరూ కారకులే’ అని అఖిలేష్‌ పేర్కొన్నారు. 
చదవండి👉 మహానాడు వేదికపై చంద్రబాబు మేకపోతు గాంభీర్యం

పాఠశాల విద్యాభివృద్ధిలో యూపీ చివరి నుంచి నాలుగో స్థానంలో ఉండటం కలవర పరచే విషయమని అన్నారు. దేశానికి ఎందరో ప్రధానులను అందించిన రాష్ట్రం యూపీ. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంది. అయినా తీరు మారలేదని అఖిలేష్‌ చురకలు అంటించారు. 2012 నుంచి 2017 వరకు ఆయన యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
చదవండి👇
ఇప్పుడే షో మొదలైంది.. వారంలో ఇద్దరు మంత్రుల అవినీతి చిట్టా!
రాజ్యసభ సీటు కోసం అలకబూనిన ‘సీఎం చంద్రూ’.. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై!

మరిన్ని వార్తలు