సీఎం జగన్‌ సెటైర్లు.. 'పచ్చళ్లు అమ్మినా అది మావారే అయ్యుండాలి'

15 Sep, 2022 19:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గురువారం పరిపాలన వికేంద్రీకరణ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ఆయన బృందం ఆలోచనలు ఎలా ఉంటాయో సభ ద్వారా ప్రజలకు తెలియజేశారు. 

'ఈ పెత్తందారీల మనస్థత్వాలను పరిశీలిస్తే.. మా బినామీ భూముల ప్రాంతాలు మాత్రమే రాజధానిగా ఉండాలి. ఇంకెక్కడా ఉండకూడదు. పత్రిక అంటూ ఉంటే అది కేవలం ఈనాడు, మా చంద్రజ్యోతి మాత్రమే. మరే పత్రికా ఉండకూడదు. పచ్చళ్లు అమ్మినా కూడా అది మావారి పచ్చళ్లే అమ్మాలి. చిట్‌ఫండ్స్‌ వ్యాపారం చేసినా కూడా మావారిదే జరగాలి. మా వాడైతే ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి కూడా ఏమైనా చేయొచ్చ. డైరీలు, పాలు అంటే ప్రభుత్వ రంగంలో లాభాల్లో ఉన్న చిత్తూరు డైరీని కూడా మూసేయాలి. మా హెరిటేజ్‌ కోసం ఆ డైరీల గొంతు నొక్కాలి.

ఆ రంగం, ఈ రంగం.. వాళ్లు, వీళ్లూ అనే తేడాలేదు. ఎవ్వరూ కూడా మార్కెట్‌లో ఉండకూడదు. ఏ ఇండస్ట్రీలో అయినా ఉంటే నేను నా మనుషులు మాత్రమే ఉండాలి. కార్పొరేట్‌ చదువులు తీసుకుంటే కూడా కేవలం మా నారాయణ, మా చైతన్య మాత్రమే ఉండాలి. గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం కూడా ఉండకూడదు. అన్ని వ్యవస్థలు కూడా మన మనుసుల చేతుల్లోనే ఉండాలి. అన్ని ప్రతిపక్ష పార్టీల్లో కూడా నా మనుషులే ఉండాలనేది ఈ పెత్తందారీల మనస్థత్వం' అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ఒక్క రాజధాని విషయంలోనే కాదు.. ఏ విషయం తీసుకున్నా కూడా వీళ్ల ఆలోచనలు, డిజైన్లు ఇదే విధంగా ఉంటాయని సీఎం జగన్‌ మండిపడ్డారు.

చదవండి: (కట్టని రాజధాని గురించి ఉద్యమాలా?: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు