-->

చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి: సీఎం జగన్‌ ట్వీట్‌

3 Apr, 2024 05:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోరారు. ‘‘2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోదీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు’’ అని ఎక్స్‌ వేదికగా సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

అదే ఎక్స్‌ లో మరో ట్వీట్‌ చేసిన జగన్‌.. ‘‘లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్‌ ఇచ్చే వలంటీర్లు.. ఏప్రిల్‌ 1 నుంచి ఇవ్వ డానికి వీల్లేదని చంద్రబాబు ఆయన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదే­శాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారి­పోయాడో ఆలోచించండి’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers