టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు  

13 Sep, 2021 07:36 IST|Sakshi

జేసీ ప్రభాకర్‌పై సొంత పార్టీ నేతల మండిపాటు

మీ వల్లే గ్రూపు తగాదాలని ధ్వజం

చిచ్చు రేపుతున్న సదస్సు 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. అనంతపురం కమ్మ భవన్‌లో శనివారం జరిగిన ‘రాయలసీమ నీటి ప్రాజెక్టుల సదస్సు’ ఆ పార్టీ నేతల్లో చిచ్చు రేపింది. సదస్సు నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సొంత పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు. జేసీ సోదరుల పెత్తనాన్ని ఇక సహించబోమని స్పష్టం చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

వాస్తవానికి జిల్లా టీడీపీ నేతల మధ్య మొదట్నుంచీ సఖ్యత లేదు.  సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో ఆధిపత్య పోరు కూడా అధికమైంది. జేసీ బ్రదర్స్‌ పార్టీలో చేరిన తరువాత అంతర్గత కుమ్ములాటలు మరింత ఎక్కువయ్యాయని ఆ పార్టీ సీనియర్‌ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. (చదవండి: గోబెల్స్‌కు తమ్ముళ్లు.. టీడీపీ అబద్ధపు ప్రచారాలు

జేసీ బ్రదర్స్‌పై ముప్పేట దాడి.. 
జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు టీడీపీని మరింత అంధకారంలోకి నెట్టేలా ఉందని, నియంతృత్వ వైఖరి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ ఆదివారం ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ హెచ్చరించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి జేసీ సోదరులంటే మొదట్నుంచీ పడదు. వారితో విభేదించే ఆయన కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వెళ్లారు. ఆ తరువాత జేసీ సోదరులకు వ్యతిరేకంగా ప్రతి సందర్భంలోనూ గళం విని్పంచారు. తాజాగానూ జేసీ ప్రభాకర్‌ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘జేసీ గూండాగిరికి భయపడం. వారి తప్పుడు పనులను సమరి్థంచాలా? వారు టీడీపీలోకి వచ్చాకే గ్రూపు రాజకీయాలు పెరిగాయి. పార్టీని సర్వనాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు.

నియోజకవర్గాల వారీగా చిచ్చు పెడుతున్నారు. మా నియోజకవర్గాల్లో మీ జోక్యం ఏంటి? మీ పెత్తనాన్ని ఇక సహించం. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుని మీకు వ్యతిరేకంగా పోరాడతాం’ అని హెచ్చరించారు. మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందించారు. జేసీ ఆరోపణలు అర్థరహితమని, వాటిని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్‌ విసిరారు.

మాజీ మంత్రి పరిటాల సునీత సైతం జేసీ వ్యాఖ్యలను తప్పుబట్టారు.   పారీ్టలో ఏవైనా సమస్యలు ఉంటే.. అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ బహిరంగంగా ఒక సభలో ప్రస్తావించడం సరైంది కాదని అన్నారు. చర్చను తప్పుదోవ పట్టించేలా ఆయన మధ్యలో కలి్పంచుకుని మాట్లాడినట్లు ఉందన్నారు.  ఉరవకొండ ఎమ్మెల్యే కేశవ్‌ సైతం సదస్సులో జేసీ వ్యాఖ్యలను ఖండించారు. అలా చేయకుండా ఉండాల్సిందన్నారు. అనంత టీడీపీలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. కాలవ శ్రీనివాస్‌పై అభ్యంతరాలు ఉంటే చంద్రబాబుతో మాట్లాడాలని జేసీ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు.

ఉనికి కోసం పాట్లు.. 
జిల్లా టీడీపీ నేతలు ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటికీ ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో అడపాదడపా ఉనికి చాటుకునేందుకు ‘తమ్ముళ్లు’ ప్రయతి్నస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల సందర్శన, సదస్సులంటూ హడావుడి చేస్తున్నారు. మొదటి సదస్సులోనే వర్గ విభేదాలు బహిర్గతం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.

చదవం‍డి:
కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు..  

మరిన్ని వార్తలు