గాంధీ భవన్‌కు చేరిన ఎల్లారెడ్డి పంచాయతీ

25 Jun, 2022 12:21 IST|Sakshi

టీ కాంగ్రెస్‌లో మరోసారి బయటపడ్డ విభేదాలు

హైదరాబాద్: టీ కాంగ్రెస్‌ నేతలు మదన్‌ మోహన్‌రావు, సుభాష్‌ రెడ్డిల మధ్య వివాదం మరింత ముదరడంతో పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎల్లారెడ్డిలో మొదలైన వీరి లొల్లి గాంధీ భవన్‌కు చేరింది. స్థానికంగా ఆధిపత్య పోరు కోసం యత్నించే క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. నువ్వు ఎంతంటే.. నువ్వు ఎంత అనే స్థాయికి చేరడంతో చివరకు కొట్లాటకు దారి తీసింది.

ఈ క్రమంలోనే సుభాష్‌రెడ్డి వర్గీయులపై మదన్‌మోహన్‌ అనుచరుల దాడికి దిగారు. దాంతో మదన్‌మోహన్‌పై చర్యలు తీసుకోవాలని సుభాష్‌రెడ్డి వర్గం గాంధీ భవన్‌కు వచ్చింది. తక్షణమే మదన్‌మోహన్‌పై చర్యలు తీసుకోవాలని, అప్పటివరకూ గాంధీ భవన్‌ నుంచి వెళ్లేది లేదని సుభాష్‌రెడ్డి వర్గం అంటోంది.

మరిన్ని వార్తలు