ప్రధాని వ్యాఖ్యలు.. బీజేపీని ఉద్దేశించినవే!: కాంగ్రెస్‌ కౌంటర్‌

16 Aug, 2022 11:51 IST|Sakshi

ఢిల్లీ: స్వాతంత్ర వేడుకల్లో భాగంగా.. ఎర్రకోట నుంచి సాగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఆద్యంతం 75 ఏళ్ల భారతావని గురించే సాగింది. అయితే ప్రసంగంలో ప్రధాని మోదీ చేసిన బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ నొచ్చుకుంది. 

‘‘మోదీ బహుశా బీజేపీ అంతర్గత సిగపట్ల గురించి మాట్లాడి ఉంటారు. రాజకీయాల్లోనూ, బీసీసీఐ వంటి క్రీడా సంఘాల్లోనూ కేంద్ర మంత్రుల కొడుకులు కీలక పదవులు చేజిక్కించుకుంటున్న వైనాన్ని ఖండించినట్టున్నారు’’ అంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఎద్దేవా చేశారు. 

ఇదిలా ఉంటే.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు మాత్రం ప్రధాని ప్రసంగాన్ని స్వాగతించారు.   

ఇదీ చదవండి: బీజేపీకి బై.. బై.. కాషాయ పార్టీలో ఊహించని ట్విస్టులు

మరిన్ని వార్తలు