సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్‌: జైరాం రమేశ్

24 Jul, 2022 15:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌. బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా.. శనివారం ఓ జాతీయ ఛానల్‌లో మాట్లాడుతూ సోనియా గాంధీపై పరుషపదజాలన్ని ఉపయోగించడంపై మండిపడ్డారు. మరోసారి  ఇలా మాట్లాడితే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈమేరకు జైరాం రమేశ్.. జేపీ నడ్డాకు లేఖ రాశారు.
 
ఎప్పుడు సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడే బీజేపీ అధికార ప్రతినిధులు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలైన 75 ఏళ్ల సోనియా గాంధీ గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని జైరాం రమేశ్ ఆరోపించారు. ఆ పార్టీ మహిళలకు వ్యతిరేకం అనేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఇలాంటి మాటలవల్ల దేశంలో రాజకీయాలు దిగుజారుతున్నాయని ధ్వజమెత్తారు. మోదీ సహా ఎంతో మంది బీజేపీ నేతలు మహిళల పట్ల పలుమార్లు అగౌరవంగా మాట్లాడిన విషయం దేశం మొత్తానికి తెలుసన్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి అనుచిత వ్యాఖ్యలకు బాధ్యతగా దేశంలోని మహిళలందరికీ ప్రధాని మోదీ, జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. . కానీ ఇప్పటివరకు బీజేపీ నేతలు మహిళలకు క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేవని అన్నారు.
చదవండి: అగ్నిపథ్‌తో దేశ భద్రత, యువత భవిష్యత్తు అంధకారం

మరిన్ని వార్తలు