హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌

28 May, 2021 09:25 IST|Sakshi

బనశంకరి: మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళిని సీడీ కేసులో  అరెస్టు చేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ డిమాండ్‌ చేశారు. ఈ కేసులోనే హోంమంత్రి బసవరాజ బొమ్మై రాజీనామా చేయాలని, కేసు వెనుక ఉన్న అందరి పాత్రలు తేలేందుకు స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కేసులో అనేక అవకతవకలు జరిగాయని పలు ఉదాహరణలను వివరించారు. రేప్‌ కేసులో నిందితున్ని అరెస్టు చేయకపోవడం ఇక్కడ మాత్రమే చూస్తున్నామని, సిట్‌ అధిపతి సౌమేందు ముఖర్జీని సెలవుపై పంపించారని సిద్ధరామయ్య ఆరోపించారు.

చదవండి: రాసలీలల సీడీ కేసు అవును.. ఆమె తెలుసు..!
 

మరిన్ని వార్తలు