ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నాం: కాంగ్రెస్‌

9 Nov, 2020 15:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలన్ని కాంగ్రెస్ హయాంలో నెలకొల్పినేవని మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆరున్నర ఏళ్ల పాలనలో హైదరాబాద్‌ను ఎలాంటి అభివృద్ధి చేయకుండా మాటలకే పరిమితం చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లో సోమవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి హాజరయ్యారు. అలాగే జూమ్‌ ద్వారా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కమ్‌ ఠాగూర్‌ పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తుందని తెలిపారు. చదవండి: ఊపందుకుంటున్న ‘గ్రేటర్‌’ ఎన్నికల ఏర్పాట్లు

ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. అందుకోసం 8639721075 నెంబర్‌కు వాట్సప్ చేయగలరని సూచించారు. లేదా speakuphyderabad@gmail.Com చేయవచ్చని తెలిపారు. వారం, పది రోజుల పాటు వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వరద బాధితులకు ఇచ్చే పరిహారం పూర్తిగా అవినీతిమయం అయ్యిందని, నిజమైన బాధితులకు కాకుండా టీఆర్‌ఎస్‌ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని మండిపడ్డారు. వరద పరిహారం పై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు