వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు 

2 Nov, 2021 04:41 IST|Sakshi

తెలంగాణ వచ్చాక లబ్ధి పొందింది కేసీఆర్‌ కుటుంబమే: మధుయాష్కీ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సామాజిక న్యాయ సాధన కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీ వర్గాలకిస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ చెప్పారు. డీసీసీ అధ్యక్షులతో సమావేశం అనంతరం గాంధీభవన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, ప్రచార కమిటీ కోకన్వీనర్‌ అజ్మతుల్లా హుస్సేన్, రంగారెడ్డి, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఈర్ల కొమురయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు.

తెలంగాణ వచ్చాక లబ్ధి పొందింది కేవలం కేసీఆర్‌ కుటుంబం మాత్రమేనన్నారు. మం చిర్యాల జిల్లాకు చెందిన మహేశ్‌ అనే నిరుద్యోగి ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారణమని, ఆయ నపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాం డ్‌ చేశారు. నిరుద్యోగులు నిరాశతో బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 8, 9 తేదీల్లో పార్టీ సభ్యత్వ నమోదుపై డీసీసీ, మండల, టౌన్, బ్లాక్‌ కాంగ్రెస్‌ నేతలకు శిక్షణ ఇస్తామని, రాష్ట్రంలోని యువత పెద్ద సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేసుకోవాలని మధుయాష్కీ కోరారు.

నిరుద్యోగ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగసభకు లక్షలాది మంది హాజరు కావాలని, ఈ సభకు రాహుల్‌గాంధీ ముఖ్యఅతిథిగా వస్తారని వెల్లడించారు. బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్‌ ఉత్పత్తులతో పాటు పప్పుదినుసుల రేట్లు పెరిగి సామాన్యు డికి భారంగా మారాయని, మతం పేరుతో విడిదీసి పాలించే బీజేపీ.. ఆ పార్టీకి వత్తాసు పలికే టీఆర్‌ఎస్‌కు చరమగీతం పాడితేనే ఆగమైన ని రుద్యోగ బతుకులు బాగుపడతాయని వ్యాఖ్యానించారు.

దేశంలోని ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా జనజాగరణ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమైక్యమే తన స్టాండ్‌ అంటూ రాష్ట్ర విభజన విషయంలో పార్టీ ఎమ్మె ల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో కూడా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పు గా ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి టికెట్లయినా ఫైనల్‌ చేసేది ఏఐసీసీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మధుయాష్కీ సూచించారు.

మరిన్ని వార్తలు