‘స్వార్థం కోసమే ఈటల రాజీనామా చేశారు’

12 Jun, 2021 17:47 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఏరోజూ ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ ప్రజల సంక్షేమం కోసం పాటుబడలేదని, స్వార్థం కోసమే రాజీనామా చేశారని కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు ఉద్యమకారుని పేరిట ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఈటల, టీఆర్‌ఎస్‌ను ఎప్పుడూ నమ్మొద్దని సూచించారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ను ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు.

2018 ఎన్నికల్లో నాకు కేసీఆర్ డబ్బులు పంపించారని ఈటల అంటున్నారు. అసలు ఎన్నికలు ముగిసి రెండున్నర సంవత్సరాలు కాగా అప్పటి నుంచి ఈ విషయం ఎందుకు అడగలేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఈటలకు ఓటమి ఖాయమని, హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ‘ఈటల రాజేందర్.. అమరవీరుల స్థూపానికి మొక్కి వచ్చావు.. ఈ ఏడు సంవత్సరాలో ఒక్క అమరవీరుని గురించి మాట్లాడారా...? ఒక్క కుటుంబంనైనా పరామర్శించారా..? దీనిపై అమరవీరుల కుటుంబాలకు సమాధానం చెప్పాలని’ సూటిగా ప్రశ్నించారు.

చదవండి: నేడు ఈటల రాజీనామా.. బీజేపీలోకి రాథోడ్‌ 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు