ఆదివాసీ, దళితులను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది

8 Aug, 2021 21:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆదివాసీ, దళితులను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లు రవి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన పోడు భూములకు ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. దళితులకు దళితబంధు ఇవ్వడం లేదని చెప్పారు. టీఆర్ఎస్‌ మోసాలను ఎండగట్టేందుకు ఇంద్రవెల్లిలో ఆత్మగౌరవ సభ జరగనుందని తెలిపారు.

మరిన్ని వార్తలు