అందుకే ఢిల్లీకి.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్‌రెడ్డి

16 Nov, 2022 17:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారన్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 'నేను విమానంలో ఢిల్లీకి రావడం కొత్త కాదు. మనవడి స్కూల్‌ ఫంక్షన్‌ కోసమే ఇక్కడకు వచ్చాను.

నేను రాజకీయాల్లో ఉన్నా.. ఇంకా రిటైర్‌ కాలేదు. నేను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు' అని మర్రి శశిధర్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

చదవండి: (CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్‌ కొత్త వ్యూహం!)

మరిన్ని వార్తలు