ఎన్‌డీఏకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాహుల్‌.. కేంద్రంపై ఫైర్‌

23 Jul, 2022 16:28 IST|Sakshi
రాహుల్ గాంధీ

సాక్షి,న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం తమ వద్ద సమాచారం లేదని బదులివ్వడంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం తీరును తప్పుబడుతూ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్‌డీఏ అంటే 'నో డేటా అవైలబుల్' అని సెటైర్లు వేశారు. ఓ జిఫ్ ఇమేజ్‌ను కూడా జత చేసి ట్వీట్ చేశారు.

' ఆక్సీజన్ కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు. నిరసనలు చేపట్టిన రైతుల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు. కాలినడక వల్ల ఒక్క వలస కూలీ కూడా మరణించలేదు. మూక దాడుల వల్ల ఒక్కరు కూడా మరణించలేదు. ఒక్క జర్నలిస్టును కూడా అరెస్టు చేయలేదు అని నో డేటా అవైలబుల్‌(ఎన్‌డీఏ) ప్రభుత్వం ప్రజల్ని నమ్మించాలనుకుంటుంది. డేటా లేదు. సమాధానం లేదు. జవాబుదారీ లేదు' అని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.

పార్లమెంటు సమావేశాల్లో భాగంగా.. కోవిడ్ వల్ల ఎంతమంది అంగన్‌వాడీ కార్యకర్తలు చనిపోయారని విపక్షాలు కేంద్రాన్ని శుక్రవారం అడిగాయి. అందుకు తమవద్ద సమాచారం లేదని కేంద్రం బదులిచ్చింది. 2014 నుంచి దేశంలో ఎంత మంది జర్నలిస్టులు అరెస్టయ్యారనే ప్రశ్నకు కూడా తెలియదని సమాధానం చెప్పింది. దీంతో కేంద్రం తీరును విమర్శిస్తూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
చదవండి:మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు

మరిన్ని వార్తలు