‘మీ లవర్‌ వేరొకరితో వెళ్తే.. ఓసారి అద్దంలో చూస్కోండి’

9 Jun, 2021 18:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ప్రేయసి (గర్ల్‌ఫ్రెండ్‌) వేరొకరితో వెళ్తే ఆమెను నిందించొద్దు.. ఒకసారి మీ ముఖం అద్దంలో చూస్కోండి’ అని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ట్వీట్‌ చేశాడు. పార్టీని నాయకులంతా వీడుతుండడంపై సొంత పార్టీపైనే ఓ నాయకుడు చేసిన ట్వీట్‌ ఇది. వెళ్లేవారిని తప్పు పట్టకూడదని.. పార్టీ మారాలని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. కేంద్ర మాజీ మంత్రి, రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న జితిన్‌ ప్రసాద కాంగ్రెస్‌ పార్టీని వీడి బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అతడి రాజీనామా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం చేకూరనుంది. అయితే అతడు పార్టీని వీడడంపై కాంగ్రెస్‌ పార్టీ భిన్నంగా స్పందించింది. పార్టీని వీడినందుకు జితిన్‌ ప్రసాదకు ధన్యవాదాలు అని తెలిపింది. ఈ పరిణామంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్‌ షా భిన్నంగా స్పందించాడు. సాధారణ ప్రపంచంలో వేటగాడిగా ఉన్న కాంగ్రెస్‌లోనే ఏదో సమస్య ఉందని ట్వీట్‌ చేశాడు. ఇక మరో విధంగా స్పందిస్తూ ‘ఒకవేళ మీ ప్రేయసి ఇతరులతో వెళ్తిఏ ఆమెను నిందించకుండా మీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోవాలి’ అని హితవు పలికారు. ఈ విధంగా సొంత పార్టీ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎందుకంటే వరుసగా పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారిని ఆపడంలో పార్టీ విఫలమవుతోందని పరోక్షంగా చెబుతున్నాడు. 

ఇక పార్టీని వీడిన జితిన్‌ ప్రసాదపై ప్రశంసల వర్షం కురిపించాడు. జితిన్‌ మంచి నాయకుడు అని, అతడితో ఇటీవల మాట్లాడినట్లు తెలిపాడు. జితిన్‌ ప్రసాదతో బీజేపీకి లాభం.. కాంగ్రెస్‌కు నష్టం అని పేర్కొన్నాడు. అతడిని పార్టీలో చేర్చుకున్నందుకు బీజేపీని నిందించనవసరం లేదు. నేనయినా అదే చేసేవాడిని. అది రాజకీయం అంటూ ట్వీట్‌ చేశాడు.

చదవండి: భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్​ కీలక నేత..

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు