కొండా బర్త్‌డే: కాంగ్రెస్‌లో ‘కేకు‌’ రగడ..

27 Feb, 2021 11:31 IST|Sakshi
వాగ్వాదానికి దిగిన నేతలు

విశ్వేశ్వర్‌రెడ్డి బర్త్‌డే వేడుకల్లో కేక్‌ ముందుగానే కట్‌ చేశారని ఆగ్రహం  

తాండూరు టౌన్‌: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్‌ నేతల మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కొండా జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్‌ కట్‌ చేయాలని నాయకులు ముందుగా భావించారు. అయితే కార్యకర్తలు, నేతలు అందరూ రాకముందే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్‌మహరాజ్‌ కేక్‌ కట్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన పార్టీ నేత ఖయ్యూం రమేష్‌మహరాజ్‌తో వాగ్వాదానికి దిగారు.

కార్యకర్తలందరి సమక్షంలో వేడుకలు నిర్వహిస్తే బాగుండేదని, కొందరి సమక్షంలో తూతూ మంత్రంగా జరపడం సరికాదన్నారు. తాను అత్యవసర పనిమీద వెళ్లాల్సి ఉందని, ఉందని, మరో పెద్ద కేకు తీసుకొస్తారని, దానిని కట్‌ చేసి వేడుకలు నిర్వహించుకోవాలని రమేష్‌ మహరాజ్‌ చెప్పడంతో వాగ్వాదం మరింత ముదిరింది. ఎవరికి వారే నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రమేష్‌ మహరాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మరో కేక్‌ తీసుకొచ్చి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు అలీం, బస్వరాజ్, మల్లికార్జున్, ప్రభాకర్‌గౌడ్, వరాల శ్రీనివాస్‌రెడ్డి, లింగదల్లి రవి, షుకూర్‌ పాల్గొన్నారు.
చదవండి:
ముగ్గురు మంత్రులు.. 3 జిల్లాలు  
అందమైన యువతుల ఫొటోలతో ఎర, గొంతులు మార్చి..

 

మరిన్ని వార్తలు