TS Raids: బీజేపీ టార్గెట్‌గా జగ్గారెడ్డి సంచలన కామెంట్స్‌

24 Nov, 2022 15:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో పొలిటికల్‌ హీట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో రాజకీయ నేతలు టీఆర్‌ఎస్‌, బీజేపీ సర్కార్లను టార్గెట్‌ చేసి సంచలన కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఈ దాడులపై స్పందించారు. 

కాగా, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ, ఐటీని బీజీపీ వాడుతోంది. కేసీఆర్‌ ఏసీబీని వాడుకుంటున్నారు. వీరిద్దరి మధ్య దాడుల వల్ల ప్రజలు జరిగే లాభమేంటి?. మా దగ్గర ఏ శాఖ లేదు.. మేమేమీ చేయలేము. టీడీపీలో ఉన్నప్పటి నుంచే మంత్రి మల్లారెడ్డి సంపాదించాడు. గత ఎనిమిదేళ్లలో లేని దాడులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు. గోవాలో క్యాసినో ఫ్రీ.. అక్కడ బీజేపీనే కదా అధికారంలో ఉంది. 

గోవాలో ఆడించేది మీరే.. ఇక్కడ దాడులు చేసేది కూడా మీరేనా అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్‌ మనుగడ దెబ్బతీయాలని చూస్తోంది. మీడియాను అడ్డంపెట్టుకుని కుట్ర పన్నుతోంది. లైమ్‌లైట్‌లో ఉంచడానికే టీఆర్‌ఎస్‌ మంత్రులపై దాడులు జరుపుతోంది అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు