ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులే.. దళితబంధు 

18 Aug, 2021 08:16 IST|Sakshi

ఏడేళ్లుగా ఆ నిధులను దారిమళ్లించారు

ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి   

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్తగా చేసిందేమీ లేదని, ఏడేళ్లుగా ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లించి, ఇప్పుడు తెరపైకి దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్సీ తాటికొండ జీవన్‌రెడ్డి అన్నారు. 75 ఏళ్లుగా దేశాన్ని పాలించిన వారు ఈ ఆలోచన ఎందుకు చేయలేదన్న సీఎం కేసీఆర్‌ ప్రశ్నకు సమాధానంగా మంగళవారం కరీంనగర్‌లోని ఇందిరాభవన్‌లో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, కరీంనగర్‌ టౌన్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి జీవన్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో దళితులకు ఇచి్చన హామీలేవీ కేసీఆర్‌ నెరవేర్చలేదని, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూపంపిణీ విషయంలో మాట తప్పారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టి.రాజయ్యను ఆకస్మికంగా తప్పించారని, కడియంను ఆ స్థానంలో కూర్చోబెట్టినా.. రెండోసారి అయనను కేబినెట్‌లోనే లేకుండా చేశారన్నారు.

>
మరిన్ని వార్తలు