ప్రధాని మోదీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి.. కారణం ఇదే..

23 Mar, 2023 13:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ, నియోజకవర్గంలో జాతీయ రహదారులపై చర్చించానని పేర్కొన్నారు. ఎల్‌బీ నగర్‌ నుంచి మెట్రో రైల్‌ పొడిగించాలని కోరానన్నారు.

‘‘కొన్ని అంశాలు మీడియాతో చెప్పలేనివి ఉంటాయి. అన్ని అంశాలపై ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారు. రెండు, మూడు నెలలలో అన్ని మంజూరు చేసే అవకాశం ఉంది. ప్రధానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణలో వడగళ్ల వానతో రైతులు నష్ట పోయారు. కేంద్రం నుంచి పరిశీలనకు బృందాన్ని పంపాలని కోరాను’’ అని కోమటిరెడ్డి అన్నారు.
చదవండి: నడుచుకుంటూ సిట్‌ ఆఫీస్‌కు రేవంత్‌.. తీవ్ర ఉద్రిక్తత


 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు