కాంగ్రెస్‌ పార్టీలో మొదలైన సందడి.. ఆ ఎన్నికల కోసం ఏకంగా..

6 Sep, 2021 08:19 IST|Sakshi

హుజూరాబాద్‌ టికెట్‌కు 18 దరఖాస్తులు

పార్టీ బలోపేతంపై నాయకుల కసరత్తు

బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టతకు చర్యలు

కరీంనగర్‌టౌన్‌: కాంగ్రెస్‌ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు, పాతతరం కార్యకర్తలు మళ్లీపార్టీకి పునర్‌వైభవం తెచ్చేందుకు సంస్థాగత కసరత్తును ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలోనే టీఆర్‌ఎస్‌కు, హుజురాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ వ్యవహారంతో జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలపడంతో పాటు బీజేపీ, టీఆర్‌ఎస్‌ల ఎత్తులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలనే ఏకైక లక్ష్యంతో హుజూరాబాద్‌ టికెట్‌ విషయంపై పీసీసీ, ఏఐసీసీ స్థాయిలో కసరత్తునుముమ్మరం చేసింది. ఇటీవలనే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కంఠాగూర్‌తో పాటు రాష్ట్రస్థాయి కాంగ్రెస్‌ నేతలు కరీంనగర్‌లో సమావేశం నిర్వహించి హుజూరాబాద్‌లో గట్టిపోటీ ఇస్తూ సీటును కైవసం చేసుకునే దిశగా కార్యకర్తలకు నిర్దేశనం చేశారు. దీంతో జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో పాటు అనుబంధ విభాగాల నాయకులంతా పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టారు.

హుజురాబాద్‌ టికెట్‌కు దరఖాస్తుల సందడి
హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక కోసం మొదట మాజీ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్యే సాంబయ్యల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ పీసీసీ సమావేశంలో స్థానిక నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని వచ్చిన సూచన మేరకు ఈనెల 1 నుంచి 5వ తేదీ వరకు డీసీసీ దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో 18 మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. 

చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్‌ డైలాగులు.. వాట్సాప్‌ స్టేటస్‌

మరిన్ని వార్తలు