కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నేడు చలో రాజ్‌భవన్‌

22 Jul, 2021 10:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేడు చలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కాగా తమ నిరసనలు శాంతియుతంగా కొనసాగించాలని కాంగ్రెస్‌ భావించగా.. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పందించారు.

'' శాంతియుతంగా తలపెట్టిన చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తు‍న్నారు. నిరసనలు చేస్తుంటే అరెస్ట్‌ చేయడం సరికాదు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. ఇందిరా పార్కు వద్ద జరిగే నిరసన కార్యక్రమాలలో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని'' డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు