Punjab Elections 2022: మహిళలు, రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కాంగ్రెస్‌.. ఎన్నికల మేనిఫెస్టో ఇదే..

18 Feb, 2022 17:14 IST|Sakshi

ఛండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. పంజాబ్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల్లో ఎన్నికలకు పోలింగ్‌ జరుగనున్న క్రమంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మాట్లాడుతూ.. గురునానక్ స్ఫూర్తితో మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పడబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాలపై మాఫియా రాజ్‌ను అంతం చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా పైలట్ కావచ్చు, కానీ తుఫాను వచ్చినప్పుడు, మనం కష్టాలను అవకాశంగా మార్చుకోగలగాలి.. అదే కాంగ్రెస్‌ మేనిఫెస్టో లక్ష్యమని సిద్ధూ పేర్కొన్నారు. కాగా, నూనెగింజలు, పప్పులు, మొక్కజొన్నలను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇస్తున్నట్టు సిద్దూ వెల్లడించారు. 

మేనిఫెస్టోలోని అంశాలు.. 

- పంజాబ్‌లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు.
- మహిళలకు నెలకు రూ.1,100 అందజేత. 
- ఏడాదికి 8 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు.

మరిన్ని వార్తలు