మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ ‘చార్జిషీట్‌’.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మోసాలపై కరపత్రం

2 Sep, 2022 08:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా ఇంటింటి ప్రచారం కోసం కాంగ్రెస్‌ పార్టీ ‘చార్జిషీట్‌’ వేసింది. రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్, కేంద్రంలోని అధికార బీజేపీ వైఫల్యాలతోపాటు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఎండగడుతూ 2 పేజీల కరపత్రాన్ని రూపొందించింది. మునుగోడులో పరిష్కారంకాని సమ స్యలు, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ హామీల వైఫల్యం, బీజేపీ, రాజగోపాల్‌రెడ్డి చేసిన మోసాలంటూ అనేక అంశాలను ప్రస్తావించింది.

ఈ కరపత్రంలో రాజ గోపాల్‌రెడ్డితోపాటు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీశ్‌ రెడ్డి ఫొటోలను కూడా ప్రచురించింది. మన మును గోడు–మన కాంగ్రెస్‌ పేరుతో ‘ఈ మోసాలను మర్చిపోవద్దు... ఈ మోసగాళ్లను విడిచి పెట్టొద్దు’ అంటూ ముద్రించింది. కేంద్రంలో, రాష్ట్రంలో కుమ్మ క్కయి ఒకరినొకరు కాపాడుకుంటున్న కేసీఆర్, మోదీ మోసాల్లో మచ్చుకు కొన్ని అంటూ కరపత్రంలో కాంగ్రెస్‌ పేర్కొన్న అంశాలివే...

స్థానిక సమస్యలు
► అసంపూర్తిగా డిండి, చర్లగూడెం, కిష్టరాయిని పల్లి, బ్రాహ్మణవెల్లెంల, రాచకొండ ఎత్తిపోతలు
► ప్రాజెక్టుల పేరుతో గుంజుకున్న భూములకు పరిహారం ఇవ్వని కేసీఆర్‌
► చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజీ, మినీ ట్యాంక్‌బండ్, మునుగోడులో జూనియర్‌ కాలేజీ ఏర్పాటు 
► నారాయణపురంలో పోడు భూములకు పట్టాలు
► నియోజకవర్గంలోని పేదలు, విలేకరులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. చండూరు–నాంపల్లి రోడ్‌ను డబుల్‌రోడ్డుగా మార్చే హామీ 
► ఫ్లోరోసిస్‌ బాధితులకు పింఛన్‌
రాష్ట్ర స్థాయి సమస్యలు
► దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు 
► ప్రతి రైతు కుటుంబంపై రూ.1.52 లక్షల అప్పు భారం.. 8వేల మందికిపైగా రైతుల ఆత్మహత్య 
► అమ్మహస్తం రద్దు, రేషన్‌ బియ్యంతో సరిపెడు తున్న కేసీఆర్‌.. విద్యుత్, బస్సు చార్జీల పెంపు 
రాజగోపాల్‌రెడ్డి మోసాలు...
► బీజేపీతో రూ. 22 వేల కోట్ల మైనింగ్‌ డీల్‌ కుదు ర్చుకొని నియోజకవర్గ ప్రజలకు వంచన 
► టీఆర్‌ఎస్‌తో దోస్తీ చేసి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టులు తెచ్చుకున్న స్వార్థపరుడు
► పింఛన్‌ రాని వాళ్లకు సుశీల ఫౌండేషన్‌ నుంచి పింఛన్‌ ఇస్తానన్న హామీ అమల్లో విఫలం 
► ప్రతి మండలంలో సొంత డబ్బుతో పాఠశాల, కళాశాల ఏర్పాటు హామీ బుట్టదాఖలు 
► నియోజకవర్గంలోని 10 వేల మంది యువతకు ఉపాధి అంటూ మోసం.. చర్లగూడెం రిజర్వా యర్‌ ముంపు బాధితులకు గెలిచిన 100 రోజుల్లో పరిహారం ఇప్పించకపోతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమన్న ప్రకటన మోసమే 
► గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత చదువులు పూర్తి చేయిస్తానన్న హామీ కంచికి.
బీజేపీ మోసాలు..
► చేనేత కార్మికులపై 5 శాతం జీఎస్టీ బండ
► ఫ్లోరోసిస్‌ నివారణ కోసం చౌటుప్పల్‌లో కాంగ్రెస్‌ మంజూరు చేసిన రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం    
► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, డిండి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో వైఫల్యం
► లీటర్‌ పెట్రోల్‌ రూ. 71.41 నుంచి రూ.109కి, డీజిల్‌ రూ. 55.49 నుంచి రూ. 97.82కు, వంట గ్యాస్‌ సిలిండర్‌ రూ.410 నుంచి రూ.1,055కి పెంపు
► పన్నులతో సామాన్యుడిపై భారం మో పి కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ 
► ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే యత్నం. 16 కోట్ల ఉద్యోగాలకుగాను 7 లక్షల ఉద్యోగా లిచ్చి నిరుద్యోగులను మోసం చేయడం
► గిరిజన వర్సిటీ, ఐఐఐటీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బీబీ నగర్‌ ఎయిమ్స్‌ లాంటి విభజన హామీల అమల్లో విఫలం
చదవండి: మునుగోడు వరకే టీఆర్‌ఎస్‌కు మద్దతు

మరిన్ని వార్తలు