కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరానికి గాయాలు

13 Jun, 2022 21:02 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పీ చిదంబరం(76) గాయపడ్డారు. సోమవారం రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ సందర్భంగా.. ఢిల్లీలో జరిగిన పార్టీ నిరసనల్లో ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. 

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత పి.చిదంబరంను పోలీసులు తోసివేయడంతో ఆయన ఎడమ పక్కటెముకలో ఫ్రాక్చర్ అయ్యాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. 

ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం అనాగరికత ప్రతిపరిమితిని దాటిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ఓ ట్వీట్‌ చేశారు. మాజీ హోం మంత్రి పి చిదంబరాన్ని పోలీసులు కొట్టారు. ఆయన అద్దాలు నేలపై విసిరారు. ఎడమ పక్కటెముకలో హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌ అయ్యింది. ఎంపీ ప్రమోద్ తివారీని రోడ్డుపై పడేశారు. ఆయన తలకు గాయం కావడంతో పాటు పక్కటెముక ఫ్రాక్చర్ అయ్యింది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే.. అంటూ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు