Loan Waiver Promise: రుణమాఫీ.. రూ.2 లక్షలు..కాంగ్రెస్‌ ‘వరంగల్‌  రైతు డిక్లరేషన్‌’లో హామీలు

7 May, 2022 02:03 IST|Sakshi

కౌలు రైతులకూ ఏటా రూ.15 వేలు పెట్టుబడి సాయం 

ప్రధాన పంటలన్నింటికీ మెరుగైన మద్దతు ధరలు 

చట్టపర అధికారాలతో ‘రైతు కమిషన్‌’ 

కాంగ్రెస్‌ ‘వరంగల్‌  రైతు డిక్లరేషన్‌’లో హామీలు

వరంగల్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు వరంగల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘రైతు సంఘర్షణ సభలో అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘రైతుల కోసం వరంగల్‌ డిక్లరేషన్‌’ను ప్రకటించారు. దీనిని కాంగ్రెస్‌ తప్పకుండా అమలు చేస్తుందని రాహుల్‌గాంధీ  ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో ఉన్న అంశాలివీ.. 

  • ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ 
  •  భూమి ఉన్న రైతులు, కౌలు రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం పేరిట ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం  
  •  ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న భూమి లేని రైతులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం 
  •  వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు తదితర పంట లకు మెరుగైన గిట్టుబాటు ధర.. రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోళ్లు. 
  •  మూసివేసిన చెరుకు కర్మాగారాలను తెరిపించేం దుకు చర్యలు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రెండు పంటలు పండించే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు. 
  • మెరుగైన పంటల బీమా పథకం అమలు. శరవేగంగా నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహా రం అందించేలా ఏర్పాట్లు. రైతుకూలీలు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా వర్తింపు.  

  •  వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం. 
  • పోడు భూములు, అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పన. 
  • రైతుల పాలిట శాపంగా మారిన ’ధరణి’ పోర్టల్‌ రద్దు. అన్ని రకాల భూములకు రక్షణ కల్పించే విధంగా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు. 
  •  రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రేతలపై కఠిన చర్యలు, పీడీ యాక్ట్‌ కింద కేసులు. సదరు సంస్థలు, వ్యక్తుల ఆస్తులను జప్తు చేసి నష్టపోయిన రైతులకు అందించేలా నిబంధనలు. 
  • అవినీతికి తావు లేకుండా నిర్దిష్ట కాల పరిమితిలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి. 
  • రైతు హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో ‘రైతు కమిషన్‌’ ఏర్పాటు.  
  •  భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన పంటల ప్రణాళిక. వ్యవసాయాన్ని పండుగగా మార్చేలా ప్రణాళికలు. 
  • పంటలకు గిట్టుబాటు ధరల కల్పన.  
మరిన్ని వార్తలు